Site icon NTV Telugu

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన బ్రావో !

వెస్టిండీస్‌ క్రికెటర్ డ్వేన్‌ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. టీ-20 వరల్డ్‌ కప్‌ తర్వాత క్రికెట్‌ నుంచి పూర్తిగా వైదొలగనున్నట్లు ప్రకటించాడు. తన కెరీర్‌లో ఎన్నో హెచ్చుతగ్గులు చూశానని, ఇక రిటైర్‌మెంట్‌ తీసుకోవాల్సిన సమయం వచ్చిందంటూ కాస్త బావోద్వేగానికి లోనయ్యాడు. 18 ఏళ్ల పాటు వెస్టిండీస్‌ తరపున ప్రాతినిధ్యం వహించాడు బ్రావో. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ నుంచి తప్పుకున్నా… లీగ్‌ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.

అటు వెస్టిండీస్ డేంజరస్‌ బ్యాట్స్‌మెన్ క్రిస్‌ గేల్ తన కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీ-20 వరల్డ్‌ కప్‌లో గేల్‌ దారుణంగా విఫలమయ్యాడు. ఇంగ్లాండ్‌పై కేవలం 13 పరుగులు, సౌతాఫ్రికాపై 12, బంగ్లాపై 4, శ్రీలంకపై ఒక పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. మొత్తం 4 మ్యాచ్‌లు ఆడిన గేల్‌ కేవలం 30 పరుగులు మాత్రమే చేశాడు. అంతకు ముందు జరిగిన ఐపీఎల్‌ లోనూ గేల్‌ రాణించలేదు. దీంతో క్రిస్‌ గేల్‌ రిటర్మెంట్‌ ప్రకటిస్తాడనే టాక్‌ నడుస్తోంది.

Exit mobile version