Site icon NTV Telugu

దుర్గామాత నిమజ్జన యాత్రలో విషాదం.. కారు దూసుకెళ్లి నలుగురు మృతి

దుర్గామాత నిమజ్జ యాత్రపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్‌లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్లే ఇవాళ ఉదయం.. దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు భక్తులు.. పాటలు పాడుతూ.. ఊరేగింపు సాగుతోన్న సమయంలో.. వేగంగా దూసుకొచ్చిన ఎస్‌యూవీ కారు.. ప్రజలపైకి దూసుకెళ్లింది.. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతిచెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్టు అధికారులు చెబుతున్నారు.

also read: గెలిచే టీం ను అంచనా వేయండి 50 లక్షలు గెలవండి

అయితే, ఆ కారులో మాదవద్రవ్యాలను రవాణా చేస్తున్నట్టు గుర్తించారు.. కారులో ఇద్దరు వ్యక్తులు ఉండగా.. ఒక క్వింటాల్ గంజాయి అందులో గుర్తించారు.. వారు ఇద్దరూ డ్రగ్స్‌కు బానిసలుగా మారిపోయారని కూడా చెబుతున్నారు. ఈ ప్రమాదంతో ఆగ్రహించిన ప్రజలు.. పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు.. ఇక, ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒక బయటకు వచ్చి వైరల్‌గా మారిపోయింది.. సమాచారం అందిన వెంటనే కలెక్టర్ మరియు ఎస్పీ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఏఎస్‌ఐని సస్పెండ్‌ చేశారు. కారులో ఉన్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Exit mobile version