తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదం నింపింది. త్రివిధదళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణం దురదృష్టకరం అన్నారు రక్షణ శాఖ కార్యదర్శి, భారత రక్షణ పరిశోధన, అభివృధ్ద సంస్థ ఛైర్మన్ డా.జి.సతీష్ రెడ్డి. జనరల్ రావత్ సుమారు 209 రక్షణ పరికరాలను స్వదేశీ పరిజ్ఞానం తో రూపొందించాలని ఓ జాబితా ను సిధ్దం చేశారు. త్రివిధ దళాలను సంఘటితం చేసి మరింత పటిష్టంగా రక్షణ దళ వ్యవస్థను సాంకేతికంగా అభివృధ్ది చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం. ఎన్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
ఆదిశగా భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థతో నిరంతరం చర్చలు జరిపేవారు బిపిన్ రావత్. చాలా వరకు నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు పురోగతి సాధించాం అన్నారు సతీష్ రెడ్డి. స్వదేశీ పరిజ్ఞానంతో స్వావలంబన సాధించాలని ఆయన పరితపించేవారు. జనరల్ బిపిన్ రావత్ తో నాకు 2016 నుంచి బాగా సాన్నిహిత్యం ఉంది. ఆయన లేని లోటు తీర్చలేనిది.
ఇదిలా వుండగా.. హెలికాప్టర్ ప్రమాదంపై ఉదయం 11.30 నిముషాలకు లోక్ సభలో, 12.15 నిముషాలకు రాజ్యసభలో ప్రకటన చేయనున్నారు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్. సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ పాలెం విమానాశ్రయానికి బిపిన్ రావత్ పార్థివ దేహం రానుంది. అక్కడి నుంచి నేరుగా కామరాజ్ మార్గ్ లోని రావత్ అధికారిక నివాసానికి పార్థివ దేహం తరలించనున్నారు. రేపు ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో ప్రభుత్వ లాంఛనాలతో బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.