NTV Telugu Site icon

దిశ కేసు: సజ్జనార్‌పై ప్రశ్నల వర్షం.. మీరు ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టా..?

హైదరాబాద్‌ శివారులో జరిగిన దిశ ఘటన సంచలనం సృష్టించింది.. ఇక, నిందితుల ఎన్‌కౌంటర్‌పై పోలీసులపై ప్రశంసల వర్షమే కురిసిందే.. ముఖ్యంగా అప్పట్లో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న సజ్జనార్‌ను హీరోగా కీర్తించిది సోషల్‌ మీడియా.. ఆయన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్ అంటూ ప్రశంసలు కురిపించింది.. అయితే, దిశ ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టిన త్రి సభ్య కమిషన్.. సజ్జనార్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది.. దిశ ఘటన ఎప్పుడు తెలిసింది..? కేసు ఎప్పుడు నమోదు చేశారు? విచారణ ఎలా జరిగింది..? ఎన్‌కౌంటర్ చేశారా..? మీరు ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టా..? అంటూ పలు రకాల ప్రశ్నలు వేసింది. కమిషన్‌.. సజ్జనార్ మధ్య జరిగిన సంభాషణను ఓసారి పరిశీలిస్తే..

కమిషన్‌: మిమ్మల్ని ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా మీడియా అభివర్ణించింది.. మీరు ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్ అని ఒప్పుకుంటారా?
సజ్జనార్‌: నేను అంగీకరించను
కమిషన్‌: ఎన్‌కౌటర్‌ స్పెషలిస్ట్ అంటే ఏమిటి ?
సజ్జనార్‌: నాకు తెలియదు
కమిషన్: మీరు ప్రతీది డీసీపీ చెప్తేనే తెలిసింది అంటున్నారు .. డీసీపీపైనే ఆధార పడతారా?
సజ్జనార్‌: గ్రౌండ్ లెవెల్‌లో ఆఫీసర్లకు పూర్తి సమాచారం ఉంటుంది.. వారికి నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తాను
కమిషన్‌: దిశ అత్యాచారం జరిగిన రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారు?
సజ్జనార్‌: మిస్సింగ్ కంప్లైంట్ రాగానే బాధితురాలి కోసం వెతకడంలో కొంత సమయం డిలే అయ్యింది
కమిషన్‌: ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
సజ్జనార్‌: ఎఫ్ఐఆర్‌ నమోదు చేయడంలో అలసత్వం వహించిన నలుగురు పోలీసు సిబ్బంది పైన సస్పెన్షన్ విధించాం
కమిషన్‌: ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో విచారణ ముగియకముందే మీడియా సమావేశం ఎలా పెట్టారు?
కమిషన్‌: మీడియా సమావేశం ఏర్పాటు చేయడం వల్లే విచారణ సరిగా చేయలేకపోయాం అని సాక్షులు చెప్పారు ?
సజ్జనార్‌: ఎన్ కౌంటర్ స్పాట్‌కి 300 మీటర్ల దూరంలో విచారణకు ఆటంకం కలగకుండా మీడియా సమావేశం ఏర్పాటు చేశాం
కమిషన్‌: వీడియో సమావేశం కోసం కుర్చీలు, టెబుల్లు తదితర సామగ్రిని అంత తక్కువ సమయంలో ఎక్కడి నుండి తెచ్చారు
సజ్జనార్‌: షాద్ నగర్ పోలీసులు సమగ్రినీ తీసుకొచ్చారు.. ఎక్కడి నుండి సామాగ్రిని తీసుకొచ్చారో నాకు తెలియదు.. ఆ ఘటన జరిగి రెండు సంవత్సరాలు అయ్యింది నాకు గుర్తు లేదు.. లాంటి ప్రశ్నలతో కమిషన్, సజ్జనార్‌ మధ్య సంభాషణ జరిగినట్టు తెలుస్తోంది.. మొత్తంగా దిశ కేసులో సజ్జనార్‌ విచారణ ముగిసినట్టుగా సమాచారం.