దసరా వేడుకల సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. శరన్నవరాత్రుల్లో నేడు 8వ రోజు కావడంతో అమ్మవారు మహిషాషిని మర్థని దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. గత ఏడు రోజులుగా బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు క్యూలైన్లో ఉన్నారు. శరన్నవరాత్రులు శుక్రవారంతో ముగియనుండటంతో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వచ్చే భక్తుల కోసం దేవస్థాం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది.
Read: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా తీవ్రత.. కొత్తగా 18,987 కేసులు