పాకిస్తాన్‌లో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ద్రవ్యోల్భణం అంతకంతకు పెరిగిపోతుండటంతో ధరలు చుక్కలను తాకుతున్నాయి. పాలు, చక్కర, పాలపొడి వంటివి కూడా భారీగా పెరిగిపోతున్నాయి. పాక్‌లో టీని సేల్స్ అధికంగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఛాయ్ దుకాణాలు కనిపిస్తుంటాయి. పాక్‌లో ఇప్పుడు రోడ్డు పక్కన ఉండే ఛాయ్ దుకాణాల్లో సింగిల్ కప్పు టీ ఖరీదు రూ.40కి చేరింది. దీంతో వినియోగదారులు టీ తాగాలంటే భయపడుతున్నారు. ఒకప్పుడు ఇండియా నుంచి చక్కెర దిగుమతి అవుతుంది. కానీ, రెండు దేశాల మధ్య నెలకొన్నపరిస్థితుల కారణంగా ఇండియా నుంచి చక్కెరను దిగుమతి చేసుకోవడం లేదు. ఇండియా నుంచి చక్కెర చౌకగా దొరుకుంది. ఇప్పుడు వేరే దేశాల నుంచి చక్కెరను దిగుమతి చేసుకోవడంతో ధరలు అమాంతం పెరిగాయి. పాలు ప్రస్తుతం లీటర్ రూ.120 ఉండగా, గ్యాస్ సిలిండర్ రూ.1500 నుంచి రూ.3000 లకు పెరిగినట్టు ఛాయ్‌వాలాలు చెబుతున్నారు. ఛాయ్ ధరలు పెరిగిపోవడంతో ఛాయ్ తాగేవారి సంఖ్య తగ్గిపోయిందని, ఫలితంగా చిన్న చిన్న వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయని ఛాయ్‌వాలాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read: మంగళగిరిలో బాలయ్య అల్లుడికి వ్యతిరేకంగా ప్రచారం చేశా- మోహన్ బాబు
