NTV Telugu Site icon

బూస్టర్ డోస్‌గా కోవిషీల్డ్.. అనుమతి కోరిన సీరం సంస్థ

భారత్‌ సహా యావత్తు ప్రపంచాన్ని కరోనా రక్కసి తన చేతుల్లో బంధించింది. కరోనా ప్రభావంతో ఎంతో మంది మృత్యువాత పడ్డారు. కరోనా బారినపడి ఎన్నో కుటుంబాలు అతలాకుతలమయ్యాయి. దీంతో ఆయా దేశాలు కోవిడ్‌ నివారణకు వ్యాక్సిన్స్‌లను కనుగొని పంపిణి చేసింది. భారత్‌లో కూడా కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ లాంటి టీకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ అనే కొత్త కరోనా వేరియంట్‌ వెలుగులోకి వచ్చింది.

అయితే ఈ నేపథ్యంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌తో మరింత ఉత్తమ ఫలితాలు రావచ్చనే అభిప్రాయంతో టీకా సంస్థలు బూస్టర్‌ డోస్‌కు అనుమతులు కోరుతున్నాయి. ఈ క్రమంలో డీసీజీఐను సీరం సంస్థ కూడా కోవిషీల్డ్‌ను బూస్టర్‌ డోస్‌గా ఇచ్చేందుకు అనుమతులు కోరింది. ఇప్పటికే బ్రిటన్లో ఈ వ్యాక్సిన్ కు అక్కడి ప్రభుత్వం బూస్టర్ డోస్ గా అనుమతి ఇచ్చిందని గుర్తు చేసింది. బూస్టర్ డోస్ కోసం తగిన నిల్వలు ఉన్నాయని సీరం సంస్థ వెల్లడించింది.