Site icon NTV Telugu

కేసులు ఇలానే పెరిగితే… ఇండియాలో…

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కేసులు పెరుగుతున్నాయి.  ఢిల్లీతో పాటుగా అటు ముంబైలోనూ రోజువారి కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  ఈ కేసుల్లో పెరుగుద‌ల మ‌రో రెండువారాల పాటు క‌నిపిస్తే థ‌ర్డ్ వేవ్ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండ‌టంతో క‌రోనా కేసుల్లో వృద్ధి క‌నిపిస్తున్న‌ది.  ప్ర‌తిరోజు దేశంలో వంద వ‌ర‌కు ఒమిక్రాన్ కేసులు న‌మోద‌వుతున్నాయి.  ఈరోజు అత్య‌థికంగా కేసులు న‌మోద‌య్యాయి.  20కి పైగా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు న‌మోదు కావ‌డం, ఢిల్లీ, ముంబైలో ఒమిక్రాన్ తో పాటు క‌రోనా కేసులు కూడా పెరుగుతుండ‌టంతో ఆందోళన మొద‌లైంది.  

Read: భార‌త్‌లో బూస్ట‌ర్ డోస్‌గా ఏ డోస్ ఇవ్వ‌బోతున్నారు?

మ‌హారాష్ట్ర, ఢిల్లీలో నైట్ క‌ర్ఫ్యూలు కూడా అమ‌లు చేస్తుండ‌టం చూస్తుంటే థ‌ర్డ్ వేవ్ అనివార్య‌మ‌ని నిపుణులు చెబుతున్నారు.  అయితే, థ‌ర్డ్‌వేవ్ ఎఫెక్ట్ ఏ మేర‌కు ఉంటుంది అన్న‌ది తెలియాల్సి ఉంది.  దేశంలో వేగంగా వ్యాక్సినేష‌న్ ను అమ‌లు చేస్తున్నారు.  జ‌న‌వ‌రి 10 నుంచి బూస్ట‌ర్ డోసులు, జ‌న‌వ‌రి 3 నుంచి 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వ‌య‌సున్న వారికి వ్యాక్సిన్‌లు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం సిద్ద‌మ‌యింది.  అంద‌రూ వ్యాక్సిన్ తీసుకుంటే కొంత‌మేర క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డే అవకాశం ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు.  

Exit mobile version