కరోనా కట్టడిపై పోరాటంలో భాగంగా భారత్‌లో కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.. మరికొన్ని దేశాలకు కూడా కోవాగ్జిన్ ఎగుమతి చేశారు.. ఇక, ఈ మధ్యే గుడ్‌న్యూస్ చెబుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ భారతీయ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక, అగ్రరాజ్యం అమెరికాలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.. 2-18 ఏళ్లులోపు వారికి కూడా కోవాగ్జిన్ తయారు చేసింది భారత్ బయోటెక్.. పిల్లలకు కోవాగ్జిన్ టీకా వేయడానికి సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినా.. ఇక, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) నుంచి ఆమోదం లభించలేదు.. కానీ, కోవాగ్జిన్ వాడేందుకు అనుమతులు కోరుతూ అమెరికాలో కూడా దరఖాస్తులు నమోదైంది.. అమెరికాలో 2 నుంచి 18 ఏళ్లలోపు వారికి కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు కోరుతూ ఓక్యుజెన్ అనే కంపెనీ దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది.
అత్యవస వినియోగానికి అనుమతి కోరుతూ.. భారత్ బయోటెక్ చిన్నారులపై చేసిన పరీక్షలకు సంబంధించిన డేటాను యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)కు పంపిందట. అయితే, ఈ పరీక్షలేవీ అమెరికాలో ఇప్పటి వరకు జరగలేదు.. దీంతో.. అనుమతిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. కాగా, ఓక్యుజెన్ భాగస్వామ్యంతో తయారు చేసిన కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి లభించిన విషయం తెలిసిందే.. దాదాపు 17 దేశాల్లో ఈ వ్యాక్సిన్‌ను ఉపయోగిస్తున్నారు. మరి 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వారికి కోవాగ్జిన్‌కు అమెరికా అనుమతి ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
