Site icon NTV Telugu

త‌ప్పుడు హెయిర్ క‌ట్ ఫ‌లితం: మోడ‌ల్‌కు రూ.2 కోట్ల ప‌రిహారం…

అప్పుడ‌ప్పుడే మోడ‌లింగ్ రంగంలో ఎదుగుతున్న అష‌నా రాయ్, ఓ హోట‌ల్ సిబ్బంది త‌ప్పుడు నిర్ణ‌యం కార‌ణంగా త‌న మోడ‌లింగ్ రంగానికి దూర‌మైంది.  త‌న కేశాల‌తో ఆక‌ట్టుకుంటూ అనేక కేశ‌సంబంధ‌మైన సౌంద‌ర్య ఉత్ప‌త్తుల‌కు మోడ‌ల్‌గా న‌టిస్తున్న‌ది.  టాప్ మోడ‌ల్‌గా ఎద‌గాలన్న‌ది ఆమె క‌ల‌.  అయితే, హోట‌ల్ సిబ్బంది నిర్వాకం కార‌ణంగా ఆమె త‌ల‌కు దుర‌ద‌, అల‌ర్జీ అంటుకున్న‌ది.  ఫ‌లితంగా ఆమె అవ‌కాశాల‌ను కోల్పోయింది.  దీంతో మోడ‌ల్ అష‌నా రాయ్ కోర్టును ఆశ్ర‌యించింది.  ఫిర్యాదురాలి వాద‌న‌లు విన్న కోర్టు హోట‌ల్ యాజ‌మాన్యం త‌ప్పుడు నిర్ణ‌యం కార‌ణంగానే ఆమె త‌న అవ‌కాశాల‌ను కోల్పోయిన‌ట్టు గుర్తించింది.  దీంతో మోడ‌ల్‌కు హోట‌ల్ యాజ‌మాన్యం రూ.2 కోట్ల రూపాయలు ప‌రిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.  

Read: వంట‌గ్యాస్‌కు మ‌ళ్లీ స‌బ్సిడీ ఇవ్వ‌నున్నారా?

Exit mobile version