కరోనా సమయంలో అనేక కంపెనీలు వర్క్‌ఫ్రమ్ హోమ్‌ను ఇచ్చేశాయి. కరోనా మొదటి, సెకండ్ వేవ్ తరువాత నెమ్మదిగా ప్రపంచం కోలుకుంటోంది. కరోనా నుంచి బయటపడుతుండటంతో అన్ని రంగాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. కొన్ని కంపెనీల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా ఆఫీసులకు వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. 2022 జనవరి వరకు అన్ని కంపెనీలు వర్క్‌ఫ్రమ్ హోమ్ పక్కన పెట్టి ఉద్యోగులు ఆఫీసులకు రావాలని ఆదేశిస్తున్నాయి.
Read: ఒమిక్రాన్ వేరియంట్‌పై మోడెర్నా సీఈఓ సంచలన వ్యాఖ్యలు…
అయితే, ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్ హోమ్ చేసేందుకు మక్కువ చూపుతున్నారని గ్రాంట్ థోరంటన్ సర్వేలో తేలింది. గ్రాంట్ థోరంటన్ సర్వే ప్రకారం ప్రతి 10 కంపెనీల్లో 6 కంపెనీల ఉద్యోగులు, కంపెనీలు కూడా వర్క్‌ఫ్రమ్ హోమ్ కు ప్రాధాన్యత ఇస్తున్నాయని తేలింది. ప్రొడక్టవిటీ పెరగడం, కంపెనీ నిర్వహణ భారం తగ్గడమే ఇందుకు కారణం అని, పని వేళలు కూడా పెరిగాయని, అవసరమైతే ఎక్కువ సమయం పాటు ఉద్యోగులు పని చేసేందుకు సిద్దంగా ఉన్నారని సర్వేలో తేలింది. వర్క్‌ఫ్రమ్ హోమ్‌ను జున్ 2022 వరకు పొడిగించాలని అనుకున్న కంపెనీలు ప్రస్తుతం కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయంతో 2022 మొత్తం వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఆంశాన్ని పరిశీలిస్తున్నాయని సమాచారం. ఉద్యోగుల భధ్రత ప్రధాన్యత ఇస్తూ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నయని గ్రాంట్ థోరంటన్ సర్వేలో తేలింది.
