NTV Telugu Site icon

CM Jagan: వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం.. నేడు ఒక్కో అకౌంట్‌లో రూ.15వేల జమ

Ys Jagan Speech

Ys Jagan Speech

ఏపీలో సంక్షేమమే ధ్యేమంగా ముందుకు సాగుతున్న వైసీపీ ప్రభుత్వం..ఇవాళ వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం కింద డబ్బులు విడుదల చేయనుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించే సభలో సీఎం జగన్ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,39,068 మంది మహిళలకు రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ విడుదల చేస్తున్నారు.
Also Read: IPL 2023 : అక్షర్ పటేల్ దెబ్బ.. పెవిలియన్ కు సూర్యకుమార్ యాదవ్

ఈ పథకం కింద రాష్ట్రంలో ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్య, బ్రాహ్మణ, వెలమ, క్షత్రియులతోపాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. 45-60 ఏళ్ల మధ్య ఉన్న ఈబీసీకి చెందిన మహిళలకు ఏటా రూ. 15 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. గడిచిన మూడేళ్లలో మొత్తం రూ. 45 వేల ఆర్థిక సాయం చేసింది. ఇప్పటి వరకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా మొత్తం రూ.1,257.04 కోట్ల సాయాన్ని ప్రభుత్వం అందించింది. తాజాగా ఇవాళ సీఎం జగన్ ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే సభలో ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు నగదు జమ చేస్తారు.
Also Read:Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి క్యూబా ప్రభుత్వ ఆహ్వానం