చంద్రునిపై క్యూబ్ రూపంలో ఉన్న ఓ ఆబ్జెక్ట్‌ను చైనాకు చెందిన యూతు 2 మూన్ రోవర్ గుర్తించింది. దూరం నుంచి మూన్ రోవర్ తీసిన ఈ ఫొటోను ఇటీవలే చైనా అంతరిక్ష సంస్థ విడుదల చేసింది. బూదరబూదరగా ఉన్న ఆ ఫొటోపై నెటిజన్లు అనేక కామెంట్లు చేస్తున్నారు. క్యూబ్ ఆకారంలో ఉండటంతో అది ఖచ్చితంగా ఇల్లే అయి ఉంటుందని కొందరు నెటిజన్లు ట్వీట్ చేస్తుంటే, కాదు, అది స్తూపం అయి ఉండొచ్చని కొందరు, కొంతమంది అది ఎలియన్ అని ట్వీట్ చేస్తున్నారు. అయితే, శాస్త్రవేత్తలు దీనిపై ఒ క్లారిటీ ఇచ్చారు.
Read: 2021లో నెటిజన్లు వీటిని తెగ వాడేశారు…
అది మిస్టరీ హౌస్, ఎలియన్ లేదా స్తూపం అయి ఉండకపోవచ్చని రాళ్ల నీడ అయి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మిషన్ మూన్‌లో భాగంగా చైనా చేంజ్ 4 ను 2019లో చంద్రుని మీదకు పంపింది. చేంజ్ 4 లోని యూతు 2 మూన్ రోవర్ అక్కడి వాతావరణాన్ని, అక్కడి నేలను, రాళ్లను పరిశోధనలు చేస్తున్నది.