టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో చైనా స్విమ్మర్ రికార్డులు సృష్టించాడు… స్విమ్మింగ్ లో కాళ్లతో పాటు చేతులు ప్రధాన భూమిక పోషిస్తాయి.. కానీ, రెండు చేతులు లేని స్విమ్మర్ జెంగ్ టావో.. ఏకంగా నాలుగు స్వర్ణాలతో తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు.. విద్యుత్ షాక్ తగలడంతో ఈ చైనాకు చెందిన 30 ఏళ్ల జెంగ్ టావో.. రెండు చేతులు కోల్పోయాడు.. కానీ, ఆత్మవిశ్వాసంతో.. ప్రపంచ స్థాయిలో నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించాడు.. ఇక, ఆ తర్వాత.. కూతురా, నన్ను చూడు.. నాకు చేతులు లేనప్పటికీ నేను చాలా వేగంగా ఈత కొట్టగలను.. అంటూ తన కుమార్తెకు వీడియో సందేశాన్ని పంపాడు.
చిన్నతనంలో విద్యుదాఘాతంతో రెండు చేతులు కోల్పోయిన జెంగ్ తన పోరాట పటిమతో ఎన్నో పతకాలు సాధించాడు.. బుధవారం పారాలింపిక్స్‌లో జరిగిన 50 మీటర్ల ఫైనల్‌లో రికార్డు సృష్టించాడు.. రేసులో గెలిచిన తర్వాత, జెంగ్ మాట్లాడుతూ.. టోక్యో 2020లో ఇది నా చివరి రేసు కాబట్టి.. ఎలాంటి ఒత్తిడి లేకుండా వెళ్లానని.. ఇది నా అత్యుత్తమ రేసుల్లో ఒకటి లని చెప్పుకొచ్చారు..