NTV Telugu Site icon

వ్య‌వ‌సాయ‌రంగంలో పెను మార్పులు… స్పేస్‌రైస్‌తో అధిక దిగుబ‌డులు…

వ్య‌వ‌సాయ రంగంలో అనేక మార్పులు వ‌స్తున్నాయి. కొత్త‌కొత్త వంగ‌డాల‌ను, పంట‌ల‌ను పండిస్తున్నారు. పెరుగుతున్న జ‌నాభాకు త‌గిన విధంగా వ్యవ‌సాయ రంగంలో మార్పులు తీసుకొస్తున్నారు. అధిక దిగుబ‌డులు ఇచ్చే వంగ‌డాల‌ను ఉత్ప‌త్తి చేసి పంట‌లు పండిస్తున్నారు. చైనా ఓ అడుగు ముందుకేసి స్పైస్ రైస్ ను పండిస్తోంది. వ‌రి గింజ‌ల‌ను స్పేస్‌లోకి పంపి అక్క‌డ రేడియోష‌న్‌, గ్రావిటీకి గురైన త‌రువాత వాటిని భూమి మీద‌కు తీసుకొచ్చి పంట పండిస్తున్నారు.

Read: ఆ వైన్ ఫ్యాక్ట‌రీలో బ‌య‌ట‌ప‌డ్డ పురాత‌న ఉంగ‌రం… దానికోస‌మే ధ‌రించేవార‌ట‌…

ఇలా పండించిన పంట అధిక దిగుబ‌డిని అందిస్తోంది. ఇటీవ‌లే చైనా ఛాంగ్ 5 రాకెట్ తో పాటుగా 40 గ్రాముల బ‌రువున్న 1500 వ‌రి విత్త‌నాల‌ను స్పేస్‌లోకి పంపింది. అంత‌రిక్ష వాతావ‌ర‌ణంలోకి వెళ్లిన త‌రువాత ఆ విత్త‌నాల్లో మార్పులు వ‌స్తాయి. వ‌రి విత్తనాలు పొడ‌వు పెరిగుతాయి. ఆ త‌ర‌వాత వాటిని భూమి మీద‌కు తీసుకొచ్చి వ్య‌వ‌సాయ క్షేత్రంలో పండిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చైనా ఇలా 200 ర‌కాల పంట‌ల‌కు సంబంధించిన విత్త‌నాల‌ను స్పేస్‌లోకి పంపి ప్ర‌యోగాలు చేసింది. మ‌రో నాలుగైదేళ్ల‌లో స్పేస్ రైస్ మార్కెట్‌లోకి రానున్న‌ట్టు అధికారులు చెబుతున్నారు.