NTV Telugu Site icon

వైర‌ల్‌: వెరైటీ టాలెంట్‌… స‌ల‌స‌ల కాగే నూనెలో…

ఎవ‌రి ద‌గ్గ‌ర ఎలాంటి టాలెంట్ ఉన్న‌దో క‌నిపెట్ట‌డం చాలా క‌ష్టం.  హిడెన్ ట్యాలెంట్ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌పుడు ఆ వ్య‌క్తి త‌ప్ప‌కుండా పాపుల‌ర్ అవుతారు.  ఎంత ట్యాలెంట్ ఉన్నా బాగా కాగే నీటిలో, స‌ల‌స‌ల కాగే నూనెలో చేతులు పెట్ట‌లేం క‌దా.  అలా పెడితే ఏమౌతుందో అంద‌రికీ తెలుసు.  ఎవ‌రూ చేయ‌ని సాహ‌సం చేస్తేనే పాపులర్ అవుతారు. అందుకోస‌మే చాలా మంది వెరైటీగా ప్ర‌య‌త్నిస్తుంటారు.  అలాంటి వెరైటీల్లో ఇది కూడా ఒక‌టిగా చెప్పుకోవ‌చ్చు.  స‌ల‌స‌ల కాగుతున్న నూనెలో చికెన్ ముక్క‌లు ఫ్రై అవుతున్నాయి.  ఇంత‌లో అక్క‌డికి వ‌చ్చిన మాస్ట‌ర్ నూనెలో చేతులు పెట్టి చికెన్ ముక్క‌ల‌ను బ‌య‌ట‌కు తీసి వాటికి మ‌సాలా అద్ది మ‌ర‌లా నూనెలో వేసి వేపుతున్నాడు.  దీనికి సంబందించిన వీడియోను కొంత‌మంది సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. 

Read: డ్రాగ‌న్ దూకుడు: ఒక్క ఏడాదిలో 250 క్షిప‌ణి ప‌రీక్ష‌లు…