Site icon NTV Telugu

పంజాబ్ సీఎంగా చ‌ర‌ణ్‌జిత్ చ‌న్నీ… అధికారికంగా ప్ర‌క‌టించిన కాంగ్రెస్‌

పంజాబ్ సీఎంగా చ‌ర‌ణ్‌జిత్ చ‌న్నీని నియ‌మిస్తున్న‌ట్టు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించారు.  కొద్దిసేప‌టి క్రితం పంజాబ్ సీఎంగా సుఖ్‌సింద‌ర్ సింగ్ ర‌ణ్‌ధవా ను ఎంపిక చేసిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి.  ప్ర‌స్తుతం ర‌ణ్‌ధ‌వా పంజాబ్ కేబినెట్ మంత్రిగా ప‌నిచేస్తున‌న్నారు.  ఆయ‌న నియామ‌కం దాదాపుగా ఖ‌రారైంద‌ని, అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి అనుకుంటున్న స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ మ‌రో ట్విస్ట్ ఇచ్చింది.  పంజాబ్ సీఎంగా చ‌ర‌ణ్‌జిత్ స‌న్నీని ఎంపిక చేసిన‌ట్టుగా పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రావ‌త్ ప్ర‌క‌టించారు.  కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌మంత్రిగా నిన్న‌టి రోజున కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే.  అంత‌ర్గ‌త విభేదాల కార‌ణంగా  ఆయ‌న రాజీనామా చేసిన‌ట్టు పేర్కొన్నారు.  

Read: ఏపీ క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

Exit mobile version