ఏపీ రాజకీయాల్లో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు జగన్ 49వ పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్‌డే జగన్’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు స్వయంగా సీఎం జగన్‌కు విషెస్ చెప్పడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ట్వీట్‌కు విశేష స్పందన లభిస్తోంది. నిమిషాల వ్యవధిలో చంద్రబాబు ట్వీట్‌కు వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి.
జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
