Site icon NTV Telugu

సీబీఐ కోర్టులో జగన్ కేసు విచారణ

సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. కోర్టుకు వ్యక్తిగత హాజరు నేటికి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రతీ విచారణకు మినహాయింపు కోరుతున్నారని సీబీఐ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించింది సీబీఐ కోర్టు.

కోర్టుకు రాకుండా హాజరు మినహాయింపుపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించామన్నారు జగన్ తరఫు న్యాయవాది. హాజరు మినహాయింపుపై హైకోర్టులో తీర్పు రావల్సి ఉందని న్యాయవాది తెలిపారు. హైకోర్టు తీర్పు త్వరలో రానుందని న్యాయవాది వివరించారు. దీనికి సంబంధించి మెమో రూపంలో సమర్పించాలని జగన్ కు సీబీఐ కోర్టు ఆదేశాలిచ్చింది. సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు మెమో దాఖలు చేశారు జగన్.

Exit mobile version