NTV Telugu Site icon

వైర‌ల్‌: జిమ్‌లో పిల్లి… మ‌నుషుల‌కు ధీటుగా బాడీ బిల్డింగ్‌…

మ‌నుషులు ఫిట్‌గా ఉండేందుకు నిత్యం జిమ్‌లో వ‌ర్కౌట్ చేస్తుంటారు.  నిత్యం వ‌ర్కౌట్ చేయ‌డం వ‌ల‌న శ‌రీరం ఫిట్‌గా ఉంటుంది.  ఎవ‌రైనా స‌రే ఫిట్‌గా ఉండాలి అంటే వాటికి త‌గిన వ్యాయామం ఉండాల్సిందే.  తిని కూర్చుంటే కొవ్వు పేరుకుపోతుంది త‌ప్పించి మ‌రోక‌టి ఉండ‌దు.  ఒక పొట్ట ద‌గ్గ‌ర కొవ్వును క‌రిగించుకునేందుకు పుష్ అప్ వంటివి బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

Read: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆంక్ష‌లు.. వారికి నెగిటివ్ స‌ర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రి…

ఇలా మ‌నుషుల‌ను పుష్ అప్‌లు చేయ‌డం చూసిన ఓ పిల్లి ఏక‌ల‌వ్యుడిలా నిత్యం అభ్యాసం చేసింది.  తాను కూడా మ‌నుషుల్లా పుష్ అప్‌లు చేయ‌గ‌ల‌న‌ని జిమ్‌లో ఓ చోట సీరియ‌స్‌గా చేస్తున్న‌ది.  అలా పిల్లి పుష్ అప్స్ చేస్తుండ‌గా ఓ వ్య‌క్తి ఆ దృశ్యాల‌ను వీడియోగా తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  దీంతో క్యాట్ వ‌ర్కౌట్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.