NTV Telugu Site icon

విమానం ఎక్కే అవ‌కాశం లేక‌…సొంతంగా విమానం త‌యారు చేశాడు…

ప్ర‌తి ఒక్క‌రికీ విమానంలో ఎక్కాల‌ని ఉంటుంది.  అయితే, అంద‌రికీ అవ‌కాశం రాక‌పోవ‌చ్చు.  విమానంలో ప్ర‌యాణం టికెట్టు పెట్టుకుంటే, కుటుంబం మొత్తం క‌లిసి రైళ్లో హాయిగా ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు.  అందుకే రైళ్లు ఎప్పుడూ కిట‌కిట‌లాడుతుంటాయి.  విమానంలో ఎలాగైనా ఎక్కాల‌నే కోరిక ఉన్న ఓ వ్య‌క్తి ఏకంగా వినానాన్నే త‌యారు చేశాడు.  దీనికోసం కొన్ని పాత వాహ‌నాల‌ను కొనుగోలు చేసి వాటి స‌హాయంతో విమానం త‌యారు చేశారు.  ఈ విమానాన్ని చూసేందుకు పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.  

Read: వూహాన్ ల్యాబ్‌పై మ‌రో నివేదిక‌… క‌రోనా లీక్ కే అవ‌కాశాలు ఎక్క‌వ‌…

బ్రెజిల్‌లోని జోయో డయాస్ న‌గ‌రానికి చెందిన జెనెసిస్ గోమ్స్ అనే వ్య‌క్తికి విమానంలో ప్రయాణం చేయాల‌ని ఎప్ప‌టి నుంచో క‌ల ఉండేది.  కానీ, ఆ క‌ల నెర‌వేర‌లేదు.  సొంతంగా విమానం త‌యారు చేసుకుంటే బాగుంటంది క‌దా అనుకున్నాడు.  అనుకున్న‌దే త‌డ‌వుగా పాత సైకిళ్లు, పాత కారు సామాన్లు కొనుగోలు చేశాడు.  వాటి స‌హాయంతో త‌న‌కు కావాల్సిన విధంగా విమానాన్ని త‌యారు చేసుకున్నాడు.  అంతేకాదు, గోమ్స్ త‌యారు చేసిన విమానాన్ని ప‌రైబా న‌గ‌రంలో జ‌రుగుతున్న ఏవియేష‌న్ ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచారు.  ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతున్న‌ది.