బిఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్పోర్ట్ వెహికిల్ ఐఎక్స్ బుకింగ్ ను ఈరోజు అధికారికంగా ప్రారంభించింది. అధికారికంగా ప్రారంభించిన తొలిరోజే పూర్తిస్తాయిలో అమ్ముడయ్యాయి. ఆన్లైన్ విధానంతో పాటుగా, డీలర్‌షిప్‌లో కూడా కార్లను బుక్ చేసుకున్నారని బీఎండబ్ల్యూ తెలియజేసింది. బుకింగ్ చేసుకున్న వాహనాలను 2022 ఏప్రిల్ నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని తెలియజేసింది. 2022 మొదటి మూడు నెలల కాలంలో రెండోదశ బుకింగ్‌లు ప్రారంభమైతాయని బీఎండబ్ల్యూ సంస్థ ప్రకటించింది. బీఎండబ్ల్యూ మొత్తం మూడు ఎలక్ట్రిక్ వాహనాలను రిలీజ్ చేయబోతున్నది. అందులో ఐఎక్స్ ఒకటి. దీని ధర రూ. 1.16 కోట్లు.
Read: ఎన్సీఏ హెడ్ గా బాధ్యతలు స్వీకరించిన వీవీఎస్…
ఇక ఈ బీఎండబ్ల్యూ ఐఎక్స్‌లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో రెండు విద్యుత్ మోటార్లు ఉంటాయి. ఈ కారు 6.1 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ బీఎండబ్ల్యూ వాహనానికి వాలాబాక్స్ ఛార్జర్ ఉచితంగా అందిస్తారు. ఈ ఛార్జర్ సహాయంతో 7 గంటల్లోనే పూర్తి ఛార్జింగ్ అవుతుంది. 150 కిలోవాట్స్ ఛార్జర్ సహాయంతో 31 నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జింగ్ చేసుకోవచ్చు. దేశంలో మొత్తం 35 నరగాల్లో డీలర్ నెట్‌వర్క్ వద్ద బీఎండబ్ల్యూ స్పీడ్ ఛార్జర్లను ఏర్పాటు చేసింది.
