మామూలు పాములను చూస్తేనే ఆమడదూరం పరుగులు తీస్తాం. అలాంటిది కోబ్రా జాతికి చెందిన పాము కనిపిస్తే అక్కడ ఉంటామా చెప్పండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరుగో పరుగు తీస్తాం. ఎక్కడా ఒక్కక్షణం కూడా వెయిట్ చేయం. ఆఫ్రికా జాతికి చెందిన వన్యమృగాలే కాదు, కోబ్రాలు కూడా చాలా భయంకరంగా ఉంటాయి. అవి వచ్చే సమయంలో ఓ విధమైన శబ్ధం చేసుకుంటూ వస్తాయి. వాటికి ఏదైనా ప్రమాదం సంభవిస్తుందని తెలుసుకున్నప్పుడు విషం శతృవుపై చిమ్ముతాయి. ఇలానే ఓ కోబ్రా పాము ఓ వ్యక్తి ఇంటికి వచ్చింది. అలా వచ్చిన ఆ కోబ్రాను చూసి భయపడకుండా నీళ్లతో కూడిన గ్లాస్‌ను అందించాడు. ఆ గ్లాస్‌లోని నీళ్లను తాగి ఆ పాము వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది.
Read: యూపీలో కాంగ్రెస్‌కు మరోషాక్: బీజేపీలో చేరిన రాయ్‌బరేలీ ఎమ్మెల్యే…
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి