Site icon NTV Telugu

వైర‌ల్‌: పెళ్లి వేడుక‌ల్లో అనుకోని అతిథి… జనాల ప‌రుగులు…

పెళ్లి వేడుక‌ల‌కు వంద‌లాది మంది అతిథులు త‌ర‌లివ‌స్తుంటారు.  అంగ‌రంగ వైభ‌వంగా వివాహం జ‌రిపిస్తుంటారు.  మెక్సికోలోని న్యూవో లియోన్ ప‌ర్వ‌త ప్రాంతంలో ఇటీవ‌లే ఓ వివాహ వేడుకను నిర్వ‌హించారు.  ఈ వేడుక‌లకు పెద్ద సంఖ్య‌లో అతిథులు హాజ‌ర‌య్యారు.  వేడుక‌ల‌కు హాజ‌రైన అతిథుల కోసం రిసెప్ష‌న్ హాలులో భోజ‌నం ఏర్పాట్లు చేశారు.  అంద‌రూ భోజ‌నాలు చేస్తుండ‌గా అనుకోని అతిథి అక్క‌డికి వ‌చ్చింది.  దాన్ని చూసి జ‌నాలు హ‌డ‌లిపోయారు.  అయితే, వారిని ఏమి చేయ‌ని ఆ అతిథి ఎలుగుబంటి అక్క‌డ ఉన్న ఆహార‌పదార్థాల‌ను వాస‌న చూసి కావాల్సిన ఆహారాన్ని తీసుకొని వెళ్లిపోయింది.  అయితే, ఆ ఎలుగుబంటి ఎవ‌రికి ఎలాంటి హాని త‌ల‌పెట్ట‌లేదు.  దీనికి సంబందించిన ఫొటోలు, వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

Read: వింత ఆలోచ‌న‌: ఐస్‌క్రీమ్ ప్లేవ‌ర్ల‌కు స‌మాధులు…

Exit mobile version