NTV Telugu Site icon

డాక్ట‌ర్ వికృత చేష్ట‌లు… చేస్తున్న ఆప‌రేష‌న్‌ను మ‌ధ్య‌లో వ‌దిలేసి…

సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత పాపుల‌ర్ అయ్యేందుకు వివిధ మార్గాల‌ను ఎంచుకుంటున్నారు.  అయితే, కొంత‌మంది సోష‌ల్ మీడియాకు బానిస‌లు అవుతూ వింత వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.  అలా సోష‌ల్ మీడియాకు బానిస‌లై జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్న‌వారిలో ఈ డాక్ట‌ర్ కూడా ఒక‌రని చెప్ప‌వ‌చ్చు.  ఆస్ట్రేలియాకు చెందిన ప్ర‌ముఖ ప్లాస్టిక్ స‌ర్జ‌న్ డేనియ‌ల్ తాను చేసిన ఆప‌రేష‌న్ల తాలూకు వీడియోల‌ను టిక్‌టాక్‌లో పోస్ట్ చేసేవాడు.

Read: ఆయన రాసిన అక్షరాలు చిరస్మరణీయంగా నిలిచివుంటాయి : ఎన్టీఆర్‌

అంతేకాదు, కొన్నిసార్లు ప్లాస్టిక్ స‌ర్జ‌రీ ఆప‌రేష‌న్ ను పూర్తి కాకుండా వ‌దిలేసి టిక్‌టాక్ వీడియోలు చేసేవాడు.  దీంతో అనేక మంది రోగులు ఆయ‌న‌పై కంప్లైయింట్ చేయ‌డం మొద‌లుపెట్టారు.  అయిన‌ప్ప‌టికీ ఆయ‌న త‌న తీరును మార్చుకోలేదు.  చివ‌ర‌కు స‌ర్జ‌న్ డేనియ‌ల్ పై అక్క‌డి ప్ర‌భుత్వం నిషేదించింది.  ఆయ‌న ఇక‌పై ఎలాంటి సర్జిక‌ల్ చేయ‌డానికి వీలులేద‌ని ఆదేశాలు జారీ చేసింది.