ఇటీవల కాలంలో ఫుడ్ బ్లాగ్‌లు సూపర్ ఫేమస్ అవుతున్నాయి. ఫుడ్ ను తయారు చేయడమే కాదు. తినేవారు కూడా చాలా ఫేమస్ అవుతున్న సంగతి తెలిసిందే. దానికి ఓ ఉదాహరణ సాపాటు రామన్. టైమ్ సెట్ చేసుకొని ఫుడ్ లాగిస్తూ ఆ వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. ఇండియాలో అదీ తమిళనాడు రాష్ట్రాలనికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన భోజనం, బిర్యానీ, చికెన్ మటన్ వంటి వాటిపై దృష్టి సారించారు. ఇక విదేశాలకు చెందిన వారైతే పిజ్జాలు, బర్గర్లపై దృష్టి పెడతారు. సాధారణంగా మనం ఒక్క బర్గర్ తినే సరికి వామ్మో అనేస్తాం. ఇంకా తినేవారైతే రెండు బర్గర్లు తింటారు.
Read: ఆ పథకాన్ని విమర్శించేందుకు టీడీపీ రెడీ అవుతోంది…
కానీ, ఇంగ్లాండ్‌కు చెందిన కైలీ గిబ్సన్ అనే 23 ఏళ్ల యువకుడు అంతకు మించి అనేలా చేశారు. అదీ టైమ్ సెట్ చేసుకొని. 24 నిమిషాల్లో 6 బర్గర్లు తిని రికార్డ్ సాధించాడు. తినడం సరే తిన్న తరువాత అంత మొత్తాన్ని అరిగించుకోవడానికి ఏం చేస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తే, అరిగించుకోవడానికి విపరీతమైన వర్కౌట్ చేస్తానని ఫలితంగా తిన్నవి ఈజీగా అరిగిపోతాయని చెప్పుకొచ్చాడు కైలీ గిబ్సన్.