ఆసియాలో అత్యంత పెద్దదైన, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ ఎక్కడుంది అంటే ఇకపై ఇండియాలోనే ఉందని చెప్పవచ్చు. సుమారు 1300 హెక్టార్ల విస్తీర్ణంలో ఎయిర్‌పోర్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్ కోసం నిర్మాణానికి రూ.10,050 కోట్లు ఖర్చుచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు సమీపంలో గౌతమబుద్ధ నగర్‌లో ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం జరుగుతున్నది. 2024 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తికానుంది.
Read: రాయి అతని జీవితాన్ని మార్చేసింది…
సంవత్సరానికి సుమారు 1.2 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించే విధంగా ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం జరుగుతున్నది. ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో రెండో అంతర్జాతీయ విమానం కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇది ఐదోవ అంతర్జాతీయ విమానాశ్రయం. గౌతమ్‌బుద్ద నగర్‌లోని జెవర్ ప్రాంతంలో ఈ ఎయిర్‌పోర్ట్‌కు ఈరోజు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి జ్యోతిరాదిత్య సింథియా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లు పాల్గొన్నారు.
