Site icon NTV Telugu

ఆ దేశానికి కాసులు కురిపిస్తున్న పూల వ్యాపారం…

పూల‌నే… కునుకేయ‌మంటా… త‌ను వ‌చ్చేనంట‌… త‌ను వ‌చ్చేనంటా… ఈ పాట గుర్తుంది క‌దా.   ఈ సాంగ్‌ను ఎక్క‌డ చిత్రీక‌రించారో తెలుసు క‌దా.  చైనాలో.  చైనాలో వేల ఎక‌రాల్లో పూల‌ను పండిస్తున్నారు.  ఇప్పుడు ఈ పూల వ్యాపారం చైనాలో మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా సాగుతోంది.  క‌రోనా త‌రువాత ఈ పూల వ్యాపారం మ‌రింత పెరిగింది.  ఆన్ లైన్ ద్వారా పూలు, బొకేలు కొనుగోలు చేసేందుకు ప్ర‌జ‌లు ఆస‌క్తి చూపుతుండ‌టంతో వ్యాపారం మ‌రింత‌గా పెరిగింది.  ఆసియాలో అతిపెద్ద పూల‌మార్కెట్ కున్మింగ్‌లో ఉంది.  

Read: పాముల‌ను త‌రిమేసేందుకు పొగ పెట్టాడు… ఇంటికి నిప్పంటుకోవ‌డంతో…

అంతేకాదు, చైనా ఈ కామ‌ర్స్ హ‌బ్ కావ‌డంతో ప్ర‌తీ వ‌స్తువును ఆన్‌లైన్ ద్వారానే కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.  ఈ పూల వ్యాపారం విలువ 160 బిలియ‌న్ యునాన్లు.  సౌంద‌ర్య ఉత్ప‌త్తుల్లో వినియోగించే పూలకు చైనా హ‌బ్ గా మారింది.  ఆన్‌లైన్ ద్వారా ఈ ర‌కం పూల‌ను అధికంగా కొనుగోలు చేస్తున్నారు.  రాబోయే రోజుల్లో  ఈ పూల వ్యాపారం మ‌రింతగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని మార్కెట్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.  

Exit mobile version