Site icon NTV Telugu

సీఎంపై పోటీ చేస్తానని మాజీ ఐపీఎస్‌ ప్రకటన.. అరెస్ట్ చేసిన పోలీసులు..

త్వరలోనే పార్టీ పెడుతున్నా.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై పోటీ చేస్తానంటూ ప్రకటించిన ఓ మాజీ ఐపీఎస్‌ అధికారిని ఒక్కరోజు తిరగకుండానే ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్‌ చేయడం సంచలనంగా మారింది… అయితే, అత్యాచార బాధితురాలికి వ్యతిరేకంగా నిందితుడికి సాయం చేశారన్న ఆరోపణలపై మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ అమితాబ్ ఠాకూర్ ను అరెస్ట్ చేసినట్టు యూపీ పోలీసులు చెబుతున్నారు.. కాగా, బీఎస్పీ ఎంపీ అతుల్‌రాయ్ త‌న‌పై అత్యాచారం చేశాడని ఆరోపించిన 24 ఏళ్ల యువతి.. తన స్నేహితుడితో కలిసి ఈ నెల 16వ తేదీన సుప్రీంకోర్టు గేటు ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది.. తనకు న్యాయం చేయాలని కోరింది..

ఇక, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆ యువతి 24వ తేదీన ఆమె మృతిచెందారు.. అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ అతుల్ రాయ్‌కు సాయం చేసేలా కొంత మంది పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.. అయితే, ఈ కేసులోనే అమితాబ్ ఠాకూర్‌ను అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. అమితాబ్ ఠాకూర్ త‌న‌ విధుల ప‌ట్ల నిబ‌ద్ధత‌తో ప‌ని చేయ‌డం లేద‌ని ఈ ఏడాది మార్చిలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆయ‌న‌ను తొల‌గించినట్టుగా తెలుస్తోంది.. ఆ తర్వాత 2022 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీఎం యోగిపై పోటీ చేస్తాన‌ని.. త్వరలోనే పార్టీ కూడా పెడతానని ప్రకటించాడు.. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేయడం చర్చగా మారింది.

Exit mobile version