Site icon NTV Telugu

త్వ‌ర‌లోనే యాపిల్ ఎల‌క్ట్రిక్ కార్లు… ఆక‌ట్టుకుంటున్న డిజైన్లు…

ప్ర‌ముఖ దిగ్గ‌జ కంపెనీలు ఎల‌క్ట్రిక్ కార్ల రంగంలోకి అడుగుపెడుతున్నాయి.  టెక్ దిగ్గ‌జం షావోమి ఇప్ప‌టికే ఎల‌క్ట్రిక్ కార్ల‌ను రిలీజ్ చేసింది.  కాగా, ఈ బాట‌లో ఇప్పుడు అమెరికన్ దిగ్గ‌జం యాపిల్‌కూడా న‌డ‌వ‌బోతున్న‌ది.  యాపిల్ కంప్యూట‌ర్లు, యాపిల్ మొబైల్ ఫోన్ల‌తో పాటు ఇప్పుడు యాపిల్ కార్లు కూడా విప‌ణిలోకి రాబోతున్న‌ది.  యాపిల్ కంపెనీ మోడ‌ల్ ఇదే నంటూ సోష‌ల్ మీడియాలో కొన్ని డిజైన్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.  

Read: ఈ మాస్క్ క‌రోనాను గుర్తిస్తుంది… ఎలానో తెలుసా…

యాపిల్ మొబైల్ మాదిరిగానే కారు కూడా ఆక‌ట్టుకునే విధంగా ఉంది. ఇందులో సెల్ఫ డ్రైవింగ్ టెక్నాల‌జీని వినియోగిస్తున్న‌ట్టు స‌మాచారం.  2025 లో ఈ యాపిల్ కారును లాంచ్ చేసేందుకు కంపెనీ స‌న్నాహాలు చేస్తున్న‌ది.  ఎఫ్ 1 కారు మాదిరిగా ఉన్నా ఈ కారు ముందు డోర్లు ముందుకు, వెన‌క డోర్లు వెన‌క్కి తెరుచుకుంటాయి.  అయితే, ఈ కారు ధ‌ర ఎంత, ఏంటి అనే విష‌యాల‌ను యాపిల్ బ‌య‌ట‌పెట్ట‌లేదు.  

Exit mobile version