Site icon NTV Telugu

యాపిల్ ఐఫోన్ 13: నెట్ వ‌ర్క్ లేకున్నా ఫోన్ కాల్స్ చేసుకొవ‌చ్చు…

నెట్ వర్క్ ఉంటేనే ఫోన్ మాట్లాడుకునే వీలుంటుంది.  నెట్ వ‌ర్క్ లేకుంటే ఏ మాత్రం అవ‌కాశం ఉండ‌దు.  అయితే, ఈ ఆంశాన్ని అధిక‌మించేందుకు యాపిల్ కంపెనీ వ్య‌వ‌స్థ స‌రికొత్త టెక్నాల‌జీని అందుబాటులోకి తీసుకొచ్చింది.  యాపిల్ ఐఫోన్ 13 లో నెట్‌వ‌ర్క్ లేకున్నా కాల్స్ మాట్లాడుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్న‌ది. త‌క్కువ ఎత్తులో కూడా శాటిలైట్‌కు క‌నెక్ట్ అయ్యే విధంగా యాపిల్ ఐఫోన్ 13 ని త‌యారు చేస్తున్న‌ట్టు టెక్ నిపుణులు చెబుతున్నారు.  ఈ మొబైల్‌లో క్వాల్‌కోమ్ ఎక్స్ 60 మోడెమ్ ను ఉప‌యోగించిన‌ట్టు నిపుణులు చెబుతున్నారు.  దీని ద్వారా నెట్‌వ‌ర్క్ లేని ప్రాంతాల్లో శాటిలైట్ కు క‌నెక్ట్ అయ్యేందుకు వీలుంటుంది.  దీనికోసం యాపిల్ సంస్థ స్పేస్ ఎక్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది.  అలానే, శాటిలైట్ క‌నెక్టివిటీ కోసం యాపిల్ కంపెనీ ఆయా దేశాల అనుమ‌తుల కొసం ధ‌ర‌ఖాస్తు చేసుకుంది.  యాపిల్ ఐఫోన్ 13 నాలుగు వేరియేష‌న్స్‌లో ల‌భ్యం అవుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.  ఐఫోన్ 13, ఐఫోన్ 13 ఫ్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్‌, ఐఫోన్ 13 మినీ వేరియంట్లలో ల‌భిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.  

Read: గిరిజ‌న్ల కోసం ఏర్పాటైన ఆ సంస్థ ఇప్పుడు ఇలా…!!

Exit mobile version