బుల్లితెర హాట్ యాంకర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు అనసూయ.. ప్రస్తుతం యాంకరింగ్ కు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు అభిమానులను పలకరిస్తూ ఉంటుంది.. పర్సనల్ విషయాల నుంచి సినిమా విషయాల వరకు అన్నీ కూడా నిర్మొహమాటంగా అభిమానులతో షేర్ చేస్తుంది.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు ఎంత హాట్ గా ఉంటాయో కామెంట్స్ కూడా అంతే ఘాటుగా ఉంటాయి.. తాజాగా సోషల్ మీడియాలో లేటెస్ట్ హాట్ ఫోటోలను షేర్ చేసింది.. అవి వైరల్ అవుతున్నాయి..
బుల్లితెరపై అందాలను ఒళకబోసిన ఈ ముద్దుగుమ్మ కొద్దిరోజుల్లోనే సెన్సేషన్ గా మారింది. గ్లామర్ షోతో మతులు పోగొట్టిన అనసూయకు సినిమాల్లోనూ నెమ్మదిగా అవకాశాలు ప్రారంభమయ్యాయి. ‘రంగస్థలం’, ‘క్షణం’, ‘పుష్ఫ’ చిత్రాలతో అనసూయ క్రేజ్ ఇండస్ట్రీలో గట్టిగానే పెరిగిందని చెప్పొచ్చు. దీంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది. ఇప్పుడు తెలుగులోనే కాకుండా వేరే భాషల్లో కూడా సినిమాలు చేస్తుంది..
ఈ క్రమంలో బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట తెగ సందడి చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో దర్శనమిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్ల ను అట్రాక్ట్ చేస్తుంది.. తాజాగా ట్రెండీ లెహంగా, మ్యాచింగ్ టాప్ ధరించి ఫొటోషూట్ చేసింది.. ఆ ఫోటోలు ఒక్కొక్కటి ఒక్కోలా ఉన్నాయి.. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..ప్రస్తుతం అనసూయ కీలక పాత్రలో నటించి ‘విమానం’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ట్రైలర్ కూడా విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ లో అనసూయ ఫుల్ బిజీగా ఉంది.. అలాగే పుష్ప 2 సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తుంది..