దేశంలో పెరిగిన నిత్యావసర ధరలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేశారు. యూపీలో కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు అమేథీ నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. 2019 సార్వత్ర ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న అమేథీని కోల్పోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ. అయితే, పెరుగుతున్న నిత్యావసర ధరలపై నిరసన చేసేందుకు అమేథీని ఎంచుకున్నారు.
Read: ఒక్కనెలలో కోటి మంది…
అమేథీ ఏమి మారలేదని, కాకపోతే, ప్రజల కళ్లల్లో తనకు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కనిపిస్తోందని అన్నారు. కేంద్రంలో బీజేపీకి రెండు సార్లు అధికారం అప్పగిస్తే అన్ని పెంచేశారని, సామాన్యుడికి ఏవీ అందుబాటులో లేకుండా చేసి కార్పోరేట్ వ్యవస్థలకు దోచిపెడుతున్నారని రాహుల్ గాంధీ చెప్పారు. యూపీలోనూ, అటు కేంద్రంలోనూ బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
