ఏపీలో ఒక వైపు టికెట్ల రేట్ల పై రచ్చ కొనసాగుతోంది. సినిమా వర్సెస్ రాజకీయం హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో అంబికా కృష్ణ కామెంట్స్ చేయడంతో మరోమారు ఈ అంశం చర్చకు దారితీస్తోంది. ఏపీలో ఎలాంటి సినిమా షూటింగ్స్ జరగటం లేదన్నారు అంబికా కృష్ణ. పెద్ద హీరోల సినిమాల షూటింగ్స్ జరగకపోవడంతో ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లేదు. అందుకే ప్రభుత్వం సినీ పరిశ్రమ, ధియేటర్లపై ఇలాంటి నిర్ణయం తీసుకుందన్నారు.
సీ క్లాస్ థియేటర్ల టిక్కెట్ల రేట్లు తగ్గింపుపై మంత్రి పునరాలోచించాలని ఆయన సలహా ఇచ్చారు. నేను సినీ పరిశ్రమ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న సమయంలోనే ఏపీలో సినిమా షూటింగ్స్ చేయాలని పెద్ద హీరోలకు గతంలోనే సూచించాను. అప్పుడు సినీ పరిశ్రమ పట్టించుకోలేదు… ఆదాయం లేనప్పుడు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటుంది. ఏపీలో సినిమా షూటింగ్స్ చేయకపోవడం హీరోలది, దర్శకుడిదే తప్పు. నిర్మాత ఏమీ చేయలేడు. వాళ్ళు చెప్పింది నిర్మాత చేయక తప్పదు. నా అభిప్రాయంలో ప్రభుత్వం చేస్తున్నది సరైనదే కానీ పల్లెల్లో సినిమా ధియేటర్ల రేట్ల విషయంలో ప్రభుత్వం ఆలోచించాలని అంబికా కృష్ణ అన్నారు.
