Site icon NTV Telugu

చైనాకు షాకిచ్చిన అమెజాన్‌… 600 ఉత్ప‌త్తుల‌పై బ్యాన్‌…

అమెజాన్ సంస్థ డ్రాగ‌న్ దేశానికి పెద్ద షాక్ ఇచ్చింది.  అమెజాన్‌లో లిస్టింగ్ చేసుకున్న 600 బ్రాండ్ల‌పై నిషేదం విధించింది.  ఈ బ్రాండ్ల నుంచి ఉత్ప‌త్తి అయ్యే ఎలాంటి వ‌స్తువులు ఇక‌పై అమెజాన్ నుంచి డెలివ‌రి కాబ‌డ‌వ‌ని అమెజాన్ పేర్కొన్న‌ది.  ఇందులో కొన్ని  పాపుల‌ర్ బ్రాండ్లు కూడా ఉన్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు.  అమెజాన్ సంస్థ ఈ నిర్ణ‌యం తీసుకోవడం వెనుక అయా కంపెనీలు తీసుకున్న నిర్ణ‌యాలే అని అంటున్నారు.  చైనాకు చెందిన కంపెనీలు కొన్ని గిఫ్ట్ కార్టుల‌ను ఎర‌గా చూపించి వినియోగ‌దారుల‌చేత పాజిటివ్ రివ్యూలు రాయించుకుంటున్నాయని, ఇది అమెజాన్ పాల‌సీకి విరుద్ధ‌మ‌ని, అందుకే ఆయా బ్రాండ్ల‌పై నిషేదం విధించిన‌ట్టు అమెజాన్ కంపెనీ పేర్కొన్న‌ది.  చైనాకు విరుద్దంగా ఈ నిర్ణ‌యం తీసుకోలేద‌ని, కంపెనీ పాల‌సీల‌కు విరుద్దంగా వారి చ‌ర్య‌లు ఉండ‌టంతో మాత్రే ఈ నిర్ణ‌యాల‌నికి వ‌చ్చిన‌ట్టు తెలిపారు.  

Read: వైర‌ల్‌: స్పైడ‌ర్ విమెన్‌… ఉత్త చేతుల‌తోనే…

Exit mobile version