సాధారణంగా రోడ్డుపై వెళ్లే బైక్, కారు, ఇతర వాహనాలకు పంక్చర్లు అవుతుంటాయి. అలా జరిగినపుడు అవసరమైతే తోసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అదే ఆకాశంలో ప్రయాణం చేసే విమానం టైర్‌కు పంక్చరైతే ఏంచేయాలి. రన్‌వే మీదున్న విమానం ముందుకు కదలాలి అంటే తప్పనిసరిగా టైర్లు ఉండాల్సిందే. పంక్చరైతే కనీసం కొంచెం కూడా ముందుకు కదలని పరిస్థితి వస్తుంది. దీంతో చేసేదిలేక విమానంలోని ప్రయాణికులంతా దిగి తలోచేయి వేసి ముందుకు తోశారు.
Read: లైవ్: రోశయ్యకు ఘన నివాళి…
చిన్న విమానం కాబట్టి ముందుకు కదిలింది. అదే పెద్ద విమానాలైతే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన నేపాల్‌లో జరిగింది. నేపాల్‌లోని టారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం రన్‌వేపై పంక్చర్ కావడంతో ప్రయాణికులు కొంతదూరం తోసుకుంటూ వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.