Adikeshava: ‘ఆదికేశవ’ రిలీజ్ డేట్ లాక్.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ‘ఆదికేశవ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వైష్ణవ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ వీడియో ఇటీవలే విడుదలై సినిమా పై అంచనాలను పెంచేస్తుంది.. మొదటి సినిమా ‘ఉప్పెన’తోనే సంచలన విజయాన్ని అందుకున్న హీరో , ‘ఆదికేశవ’ అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో మాస్ మూవీ ప్రియులను, యాక్షన్ ప్రియులను ఆకట్టుకోవాలని ఈ నూతన దర్శకుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, పంజా వైష్ణవ్ తేజ్‌ను మునుపెన్నడూ లేని విధంగా కొత్త అవతార్‌లో చూపించి మెప్పించింది.. ఈ సినిమాలో యువ సంచలనం శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమె చిత్ర అనే పాత్రలో నటించనున్నారు. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ లో ఆమె అందం, పాత్రలోని చిలిపితనం ఆకట్టుకున్నాయి. శ్రీలీలతో పాటు జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ఈ సినిమాను గతంలో జూలై లోనే విడుదల చెయ్యాలని అనుకున్నారు.. ఆ తర్వాత ఆగష్టు 18న అనుకున్నారు.. కానీ ఇప్పుడు అది మారింది.. ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీని ఆగస్ట్ 18 నుంచి నవంబర్ 10కి వాయిదా వేస్తున్నట్లు ఆదికేశవ చిత్ర బృందం ప్రకటించింది. ఇటీవలే ఆదికేశవ చిత్రీకరణ ప్యారిస్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి పాటను త్వరలో విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి పాటను విడుదల చేయనున్నట్లు సమాచారం..
తాజావార్తలు
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!