దక్షిణాఫ్రికా ఆటగాడు, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాను క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు ఏబీ డివిలియర్స్. ఇక తాను అన్ని ఫార్మాట్ల క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. తన వయస్సు పై బడిందని… అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు ఏబీడీ.
”ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. నేను అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. పెరట్ల మా అన్నయ్యలతో మ్యాచ్ అయినప్పటి నుంచి మొదలు పెడితే.. ఇప్పటి వరకు స్వచ్ఛమైన ఆనందంతో… హద్దుల్లేని ఉత్సాహంతో ఆట ఆడాను. ప్రస్తుతం నా వయస్సు 37 సంవత్సరాలు దాటింది.” అంటూ ఏబీ డివిలియర్స్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. కాగా.. ఏబీ డివిలియర్స్… ఐపీఎల్ లోని… బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు తరఫున కూడా ఆడిన విషయం తెలిసిందే. ఇక ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటన పై ఆయన ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు.
