NTV Telugu Site icon

వైర‌ల్‌: మృగాడి నుంచి కుక్క‌ను కాపాడిన గోమాత‌…

మ‌నుషులు రోజు రోజుకు మృగాలుగా మారిపోతున్నారు.  మూగ‌జీవుల‌ను ర‌క‌ర‌కాల పేరుతో హింసిస్తున్నారు.  మాన‌వ‌త్వం మ‌రిచిపోయి క‌ర్క‌శంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.  ఓ వ్య‌క్తి రోడ్డుపై ఉన్న ఓ కుక్క‌ను చెవులు ప‌ట్టుకొని మెలితిప్పుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు.  పాపం ఆ శున‌కం నోప్పిని భ‌రించ‌లేక మోరుగుతున్న‌ది.  విలవిల‌లాడిపోతున్న‌ది.  అయినా స‌రే ఆ వ్య‌క్తి వ‌దిలిపెట్ట‌కుండా అలానే దాన్ని హింసిస్తున్నాడు.  అక్క‌డ ఉన్న వ్య‌క్తులు ఆ దృశ్యాల‌ను వీడియోగా తీస్తున్నారు త‌ప్పించి అత‌డిని వారించ‌లేదు.  

Read: హుజురాబాద్: భారీగా ప‌త‌న‌మైన కాంగ్రెస్ ఓటుబ్యాంక్‌…

మూగజీవాల బాధ మూగ జీవాల‌కే తెలుసు.  ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో తెలియ‌దు హఠాత్తుగా అక్క‌డికి ఓ ఆవు ప‌రుగుపరుగున వ‌చ్చి కుక్క‌ను హింసిస్తున్న వ్యక్తిని త‌న కొమ్ముల‌తో ఎత్తి అవ‌త‌ల వేసింది.  అక్క‌డితో ఆగ‌కుండా ఆ మృగాడికి కుమ్మేసి కుక్క‌ను ర‌క్షించింది.  దీనికి సంబంధించిన వీడియోను ఫారెస్ట్ ఆఫీస‌ర్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అవుతున్న‌ది.  మూగ జీవాల బాధ మ‌రో మూగ‌జీవానికి మాత్ర‌మే తెలుస్తుందని ట్యాగ్ చేశారు.