వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పోస్టర్లు ఇప్పుడు ఢిల్లీలో దర్శనం ఇస్తున్నాయి. యూపీ సీఎం యోగి, పంజాబ్ సీఎం చన్నీ, ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్ సింగ్ ధామీ లకు సంబంధించిన పోస్టర్లతో ఢిల్లీ నగరం నిండిపోయింది. ఆ రాష్ట్రాలలో ఎన్నికలైతే ఢిల్లీలో ఎందుకని ప్రచారం నిర్వహిస్తున్నారని అనుకోవచ్చు.
Read: అలర్ట్: జనవరి 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్….
దీనికి కారణం లేకపోలేదు. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ నుంచి అధిక సంఖ్యలో వలస కార్మికులు ఢిల్లీలో నివసిస్తున్నారు. ఢిల్లీలో మొత్తం 70 నియోజక వర్గాలు ఉన్నాయి. ఈ 70 నియోజక వర్గాల్లో ఎక్కువ శాతం మంది ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారే ఉన్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా రాష్ట్రప్రభుత్వాతకు సంబంధించిన పథకాలతో కూడిన పోస్టర్లను ప్రదర్శిస్తున్నారు.
