Site icon NTV Telugu

పెట్రో మంట.. వ్యాట్‌ తగ్గించని రాష్ట్రాలు ఇవే..

పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.. పెట్రో ధరలపై ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతుండడంతో నరేంద్ర మోడీ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది.. ఇక, ఆ తర్వాత పలు రాష్ట్రాలు కూడా అదే బాట పట్టాయి.. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ పై వ్యాట్‌ తగ్గించిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 22కు పెరరగా.. మరో 14 రాష్ట్రాలు మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. అందులో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి..

ఇక, ఇప్పటి వరకు పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఓసారి పరిశీలిస్తే.. మహరాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, మేఘాలయ, అండమాన్‌ అండ్‌ నికోబార్, జార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌ మరియు రాజస్థాన్‌ రాష్ట్రాలు ఇప్పటి వరకు వ్యాట్‌ తగ్గించలేదని కేంద్రం వెల్లడించింది. అయితే, కేంద్రం, పక్క రాష్ట్రాలు పెట్రో ధరలు కోత పెట్టడంతో.. మిగతా రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది.. దీంతో.. ఎంత మేర తగ్గిస్తే బాగుంటుంది? అనే దానిపై కొన్ని రాష్ట్రాలు సమాలోచనలు చేస్తున్నట్టుగా సమాచారం. మరి, ఇంకా ఎన్ని రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటాయని అనేది వేచిచూడాల్సిందే.

Exit mobile version