NTV Telugu Site icon

Ayyappa Song: అయ్యప్ప పాటకు సూపర్ రెస్పాన్స్

Ayyappa Song

Ayyappa Song

తెలుగులో భక్తి పాటలకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే RRR ప్రొడక్షన్స్ నిర్మాణంలో నిర్మితమైన బాలస్వామిని బంగారు అయ్యప్ప పాట నక్షత్ర స్టూడియో ద్వారా రిలీజ్ అయి సోషల్ మీడియా లో 25 మిలియన్స్ పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా నక్షత్ర మీడియా చైర్మన్ రాజశేఖర్, ఆ పాట రాసిన పరమేశ్, పాటపాడిన చిన్నారి తన్వికి సంగీత దర్శకుడు సత్య దీప్, కొరియోగ్రాఫర్ హరి కాంత్ రెడ్డి, ఆ పాటకు నృత్యం చేసిన చిన్నారులకు ఆస్ బెస్టాస్ కాలనీ లోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో చిరు సత్కారం ఏర్పాటు చేశారు.

ఈ వేడుకకు మాన్లీ స్టార్ జె.డి.చక్రవర్తి గారి అతిథిగా విచ్చేసి లిరిక్ రైటర్, సంగీత దర్శకుడికి పాట పాడిన చిన్నారిని, నర్తించిన చిన్నారులను కొరియోగ్రాఫర్ ను మిగతా టెక్నిషియన్స్ అందరిని నక్షత్ర టీమ్ వారిని జ్ఞాపికలతో సత్కరించారు. ఇక ఆ అనంతరం తరువాత జె.డి చక్రవర్తి మాట్లాడుతూ ఇలా మట్టిలో మాణిక్యాలు వెలికి తీసి ఎంకరేజ్ చేస్తూ వారికంటూ ఓ ప్లాట్ ఫామ్ క్రియేట్ చేసినందుకు నక్షత్ర మీడియా అధినేత రాజశేఖర్ కి, యాంకర్ గంగకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తునట్టు వెల్లడించారు. అలాగే పాటను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

Show comments