NTV Telugu Site icon

‘ఇక ఆపండ్రా బాబు మీ అతి’… అంటోన్న నెటిజన్స్!

జనం రియాల్టీ షోస్ ఎందుకు చూస్తారు? రియల్ గా ఉంటాయి కాబట్టి. లేదంటే ఫుల్లుగా డ్రామాతో సాగే సీరియల్స్ చూసుకుంటారు కదా! కానీ, ‘ఇండియన్ ఐడల్ 12’ నిర్వాహకులకి ఈ లాజిక్ అర్థం కావటం లేదు. సక్సెస్ ఫుల్ సింగింగ్ షో లెటెస్ట్ సీజన్ పూర్తి రచ్చగా నడుస్తోంది. కంటెస్టెంట్స్, జడ్జీలు పోటీ పడి ఓవర్ డ్రామా క్రియేట్ చేస్తున్నారని నెటిజన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే మీమ్స్ తో పండగ చేసుకుంటూ… రియాల్టీ షోను బీభత్సంగా వెటకారం చేస్తున్నారు.
ఇండియన్ ఐడల్ 12 ప్రారంభమైనప్పటి నుంచీ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. అదే పనిగా కంటెస్టెంట్స్ పర్సనల్ వివరాలు, విషాదాలు చూపిస్తూ టీఆర్పీలు సంపాదిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. సింగింగ్ టాలెంట్ కంటే ఎక్కువగా సింపతీ స్టోరీలకే ప్రాధాన్యం ఇస్తున్నారని నెటిజన్స్ తిట్టిపోశారు. అయినా, ఇండియన్ ఐడల్ లో పెద్దగా మార్పేమీ రాలేదు. ‘ఫాదర్స్ డే’ సందర్భంగా కొనసాగిన స్పెషల్ ఎపిసోడ్ లో మరోసారి కంటెస్టెంట్స్, న్యాయ నిర్ణేతలు తమతమ తండ్రుల గురించి చెప్పుకుని ఎమోషనల్ అయిపోయారు. సెట్స్ మీద ఇండియన్ ఐడల్ సింగర్స్ తాలూకూ తండ్రులు కూడా కనిపించారు. ఎసిపోడ్ మొత్తం డ్రామాతోనే నిండిపోయింది!
‘ఇండియన్ ఐడల్ 12’లో జరుగుతోన్న అతి గురించి మీమ్ క్రియేటర్స్ ట్విట్టర్ లో పండగ చేసుకున్నారు. నవ్వించేవి, వెటకారం చేసేవి, ఆలోచింపజేసేవి… రకరకాల మీమ్స్ బయలుదేరాయి. నెటిజన్స్ రోజంతా వైరల్ చేసేశారు ‘ఇండియన్ ఐడల్ 12’ మీమ్స్ ని!