సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ హిట్ సినిమా పోకిరి టైటిల్ తో మరో సినిమా రాబోతోంది. ఈ సినిమాను వరుణ్ రాజ్ స్వీయ నిర్మాణంలో, హీరోగా నటిస్తున్నారు. మమతా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వికాస్ డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా వరుణ్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా, ఈ సినిమా లో నుంచి మొదటి పాటని విడుదల చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డైరెక్టర్ వికాస్ మాట్లాడుతూ, “మేము స్టోరీ లైన్ రాసుకున్నప్పటి నుంచి పోకిరి అనే టైటిల్ అనుకున్నాం. వేరే టైటిల్స్ పెడదాం అనుకున్నా పోకిరినే సెట్ అవుతుందని ఈ టైటిల్ సెట్ చేసుకున్నాం. కథ రాసుకున్నప్పటి నుంచి ఈ సినిమా మీద చాలా కేర్ తీసుకున్నాం. ఈ సినిమా బాగా హిట్ అవుతుందని నమ్ముతున్నాం” అన్నారు. హీరో, నిర్మాత వరుణ్ రాజ్ మాట్లాడుతూ, “ఈ సినిమాతో గట్టి హిట్ కొడతాం. ఈ సినిమా హిట్ అవుతుందని మాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను పవన్ కళ్యాణ్, చిరంజీవి, మహేష్ బాబుకి అభిమానిని. ఈ సినిమా టైటిల్ లోనే దమ్ముంది. పోకిరికి ఓనర్ మహేష్ బాబు గారే. మేమంతా అభిమానులం అంతే అని అన్నారు.
Pokiri : పోకిరికి ఓనర్ మహేష్ బాబే.. మేమంతా అభిమానులం!
Show comments