Site icon NTV Telugu

ఆకట్టుకుంటున్న “పొట్టుమ్… పొగట్టుమే” వీడియో సాంగ్

Sathya and Jen's Pottum Pogattu Video Song Out Now

ప్రముఖ నటుడు అర్జున్ దాస్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి నటించిన తమిళ వీడియో సాంగ్ విడుదలైంది. “పొట్టుమ్… పొగట్టుమే” అనే ఎమోషనల్ ప్రైవేట్ వీడియో సాంగ్ ను ప్రసిద్ధ మ్యూజిక్ లేబుల్ థింక్ మ్యూజిక్ ద్వారా తాజాగా విడుదల చేశారు మేకర్స్. సినిమాటోగ్రాఫర్ లియోన్ బ్రిట్టో ఈ పాటను చిత్రీకరించారు. సత్యజిత్ రవి, జెన్ మార్టిన్ ఈ సాంగ్ కు సంగీతాన్నిసమకూర్చారు. ఈ వీడియో సాంగ్‌కు దర్శకుడు లోకేష్ కనగరాజ్ అసోసియేట్ అయిన లోగి దర్శకత్వం వహించారు. ఈ సాంగ్ లో అర్జున్ దాస్, లావణ్య త్రిపాఠిల లవ్ స్టోరీని చూపించారు. లవ్, ఎమోషన్ తో కూడుకున్న ఈ వీడియో సాంగ్ లవర్స్ కు బాగా కనెక్ట్ అవుతోంది. మీరు కూడా ఈ వీడియో సాంగ్ ను వీక్షించండి.

Exit mobile version