పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం సలార్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది.. ఈ సినిమా రెండు పార్ట్ లుగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని కూడా సినిమాకు హైఫ్ ను క్రియేట్ చేశాయి.. విడుదల తేదీ దగ్గరపడటంతో సినిమా పై ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది.. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
ఇదిలా ఉండగా.. డార్లింగ్ బాహుబలి సినిమాతో వరల్డ్ ఫెమస్ స్టార్ అయ్యాడు.. అలాగే తర్వాత చేస్తున్న సినిమాలకు రెమ్యూనరేషన్ కూడా భారీ పెంచేసాడు.. ఇప్పుడు ప్రభాస్ నటించే ప్రతి సినిమాకు ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు..ఇక దాంతో ఏకంగా ఇప్పుడు ఆయన సలార్ సినిమా కోసం దాదాపు 100 కోట్ల వరకు రెమ్యూన్ రెషన్ తీసుకున్నాడని టాక్ అయితే సోషల్ మీడియా నడుస్తుంది… బాహుబలి సినిమా కోసమే ఆయన 100 కోట్ల రేమ్యున్ రేషన్ తీసుకున్నాడు కాబట్టి ప్రభాస్ ప్రస్తుతం 100 కోట్ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని మరి కొందరు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఇకపోతే ఇప్పుడు ప్రభాస్ సలార్ సినిమా కోసం ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇప్పటికే చాలా హైప్ ని క్రియేట్ చేసుకుంది..ఇప్పటికే సలార్ సినిమా టికెట్స్ బుకింగ్ కోసం పెడితే రికార్డు స్థాయిలో బుకింగ్ లను నమోదు చేసుకోవడమే కాకుండా మంచి విజయాన్ని సాధిస్తుందని ఇప్పటికే చిత్ర యూనిట్ కూడా చాలా మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు.. గతంలో వచ్చిన సినిమాలు నిరాశను మిగిల్చాయి.. ప్రస్తుతం ఈ సినిమాతో మంచి సక్సెస్ కొట్టడానికి ప్రభాస్ రెడీ అవుతున్నాడు అని తెలుస్తుంది… త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..