ఈశ్వర పరమేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనసూయ నిర్మించిన ‘ప్రేమకు జై’ సినిమాలో యంగ్ టాలెంటెడ్ అనిల్ బురగాని, ఆర్. జ్వలిత హీరోహీరోయిన్లుగా నటించారు. శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో తెరకేక్కిన ఈ మూవీ ఫ్రీరిలీజ్ వేడుక కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ సందర్భంగా ఈ వేడుకలో గెస్టుగా పాల్గొన్న దర్శకనిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ.. “చిన్న బడ్జెట్ సినిమానా? భారీ బడ్జెట్ సినిమానా? అని ప్రేక్షకులు చూడరు. బాగుంటే ఏ సినిమానైనా బ్లాక్ బస్టర్ చేస్తారు. అలాంటి బాగున్న సినిమా లిస్టులోకి వస్తుంది ఈ ‘ప్రేమకు జై’చిత్రం. ఈ మూవీ పాటలు, ట్రైలర్, పిక్చరైజేషన్ చాలా బాగున్నాయి. దర్శకుడు మల్లం శ్రీనివాస్ ప్రతిభ కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది.” అని అన్నారు. దర్శకుడు మల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ.. “ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో చోటు చేసుకున్న ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించాము, హీరో అనిల్ బురగాని, హీరోయిన్ జ్వలిత చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క ఆర్టిస్టు, టెక్నీషియన్స్ కృషి, సపోర్ట్ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చిందన్నారు.
Premaki Jai: ‘ప్రేమకు జై’ కొడుతున్నారు!

Prema Ki Jai