“ప్రేమ కడలి” సినిమా ఈ సినిమా ఈ నెల 30 న విడుదల కానుంది. ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్ నాని పిల్లిబోయన మాట్లాడుతూ “గల్ఫ్’లో ఉంటూ సినిమా తీయాలి అనే ప్యాషన్ తో ఎంతో కష్టపడి చేసిన సినిమా ఇది. ఈ సినిమా తీయడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఈ సినిమా కచ్చితంగా అందరికి నచ్చే సినిమా అని తెలిపారు. అలాగే ఈ చిత్రానికి సంగీతం అందించిన లలిత్ కిరణ్ మాట్లాడుతూ “ఈ సినిమాకి మంచి సంగీతం అందించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు, ఈ సినిమాకి ఇంత మంచి బాక్రౌండ్ స్కోర్ రావటానికి ఎంతో కష్టపడినట్లు తెలిపారు. ఈ సినిమా లో నటించిన మోహన్ బాబు గారు మాట్లాడుతూ “ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దర్శకుడు నాని పిల్లిబోయన గారికి ధన్యవాదాలు తెలిపారు, ఈ సినిమా ని అందరూ తప్పకుండా చూడాలి అని కోరారు.
Prema Kadali : జనవరి 30న ప్రేమ కడలి

Premakadali