Site icon NTV Telugu

Pavan Kalyan : టాలీవుడ్ కి మరో పవన్ కళ్యాణ్

Pawan Kalyan

Pawan Kalyan

ఓ డిఫరెంట్ కామెడీ మూవీని కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పవన్ కళ్యాణ్‌ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ ‘పురుష:’ అనే సినిమాను బత్తుల కోటేశ్వరరావు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ మూవీతో వీరు ఉలవల దర్శకుడిగా పరిచయం కానున్నారు. వీరు ఉలవల ఇంతకు ముందు మళ్లీ రావా, జెర్సీ, మసూద చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసారు. ఈ కామెడీ బేస్డ్ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ అద్భుతమైన పాత్రల్ని పోషిస్తున్నారు.

అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఈ మూవీలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. గబి రాక్, అనైరా గుప్తా కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఓ ప్రత్యేక గీతంతో షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేశారు. చిత్రీకరణ ముగియడంతో యూనిట్ అంతా కూడా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. కొత్త హీరో అయినప్పటికీ తన పర్ఫామెన్స్‌తో అదరగొట్టేశాడని యూనిట్ చెబుతోంది. నిర్మాతకు మొదటి ప్రాజెక్ట్ అయినప్పటికీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసి రిలీజ్ డేట్‌‌ను ప్రకటించనున్నారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్ గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు.

Exit mobile version