రియల్ లైఫ్ కపుల్ నాగ చైతన్య, సమంతా మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతున్నారట. గతంలో సామ్-చై ఏ మాయ చేసావె, ఆటోనగర్ సూర్య, మజిలి వంటి చిత్రాల్లో నటించారు. తాజా సమాచారం ప్రకారం మరోసారి ఈ రియల్ లైఫ్ జంట రీల్ లైఫ్ జంటగా కన్పించబోతున్నారట. నాగార్జున హీరోగా నటించనున్న చిత్రం “బంగార్రాజు”. ఇందులో నాగ చైతన్య, సమంతా కలిసి నటించనున్నారు. వారిద్దరూ స్క్రిప్ట్ విన్నారని, అందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. కళ్యాణ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నాగార్జున, రమ్య కృష్ణ మరో ప్రధాన జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం 2016లో వచ్చిన సూపర్ హిట్ “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి ప్రీక్వెల్ గా తెరకెక్కుతోంది. కరోనా ఎఫెక్ట్ తగ్గాక ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చై ‘థాంక్యూ’ చిత్రంలో నటిస్తున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మరో చిత్రం “లవ్ స్టోరీ” విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు సమంత “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2” అనే వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఇంకా “శాకుంతలం, కతువాకుల రెండు కాదల్” చిత్రాల్లో నటిస్తోంది.
మరోసారి సామ్-చై ఆన్ స్క్రీన్ రొమాన్స్…!
